Singarayakonda: విద్యార్థి తౌషిక్ తల్లి మౌలాబి మృతి: సింగరాయకొండలో భారీ ధర్నా
Singarayakonda: విద్యార్థి తౌషిక్, ఆయన తల్లి మౌలాబి మృతికి కారకులైన నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని సింగరాయకొండలో ధర్నా చేపట్టారు.
Singarayakonda: విద్యార్థి తౌషిక్ తల్లి మౌలాబి మృతి: సింగరాయకొండలో భారీ ధర్నా
సింగరాయకొండ: విద్యార్థి తౌషిక్ మృతి ఘటనపై న్యాయం కోసం పోరాడుతూ అతని తల్లి మౌలాబి మృతి చెందడంతో బంధువులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పాకల రోడ్డు నుంచి కందుకూరు సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
తౌషిక్, మౌలాబి మృతికి కారణమైన సింగరాయకొండలోని నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. విద్యా సంస్థ చైర్మన్, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరారు.
తౌషిక్ మృతి వెనుక ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మౌలాబి మృతికి కూడా న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మృతురాలి బంధువులు స్పష్టం చేశారు.




