Guntur: గుంటూరులో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన!
Guntur: గుంటూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఆందోళన.
Guntur: గుంటూరులో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన!
Guntur: బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద ఇందులో జరుగుతున్న జెన్-జీ ఉద్యమానికి మద్దతుగా AISF, AIYF, DYFI, NSUI ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
అనంతరం మీడియాతో విద్యార్థి యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజల ఓటును తీసేసే హక్కు జ్ఞానేష్ కుమార్ కు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుందన్నారు.




