Bapatla: 90% పైగా ఓటింగ్ నమోదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్!

Bapatla: బాపట్ల జిల్లాలో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం పైగా ఓటింగ్ నమోదుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం పిలుపునిచ్చారు.

Bakka Deepak, Bapatla
Published on: 17 Nov 2026 7:54 PM IST
Bapatla
X

Bapatla: 90% పైగా ఓటింగ్ నమోదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్!

బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా వ్యాప్తంగా రానున్న బాపట్ల పట్టణ మున్సిపల్ మరియు గ్రామ పంచాయితీ సాధారణ ఎన్నికలలో ఓటర్లందరూ స్వచ్ఛంగా తరలివచ్చి 90 శాతానికి పైగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు పిలుపునిచ్చారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్లో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ బాపట్ల జిల్లా శాఖ రోజు స్వచ్ఛంద సంస్థ మరియు శ్రీ భావపురి విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన నా ఓటు నా హక్కు బాపట్ల జిల్లా ఓటరు చైతన్య వేదిక అవగాహన బ్రోచర్లు మరియు విజ్ఞప్తి పత్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ నగేష్ కుమారి గారు అధికారికంగా ఆవిష్కరించారు.

అనంతరం బాపట్ల మునిసిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని గారు పట్టణ మున్సిపల్ ఎన్నికల ఓటర్ల చైతన్య బ్రోచర్ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఈనెల 26న జరగబోయే మున్సిపల్ ఎన్నికలు మరియు పంచాయతీ ఎన్నికలు ఈనెల 26 & 29 డిసెంబర్ 02 న జిల్లాలో మూడు విడతలగా జరగబోయే గ్రామ పంచాయితీ ఎన్నికలలో గ్రామీణ పట్టణ ఓటర్లందరూ ఎలాంటి ప్రలోభాలకు భయాలకు లోను కాకుండా క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఓటు వేయాలని సూచించారు ఓటరు చైతన్యం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఎంతో ఆదర్శంగా ఉందన్నారు.

డిపిఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని మాట్లాడుతూ ఆదర్శ గ్రామాలు సుందర పట్టణాల నిర్మాణం ప్రజల ఓటుతోనే సాధ్యమవుతుందని యువత మహిళలు వృద్ధులు వికలాంగులు అందరూ బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు సరైన సమయంలో రావాలని పిలుపునిచ్చారు.

నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ బాపట్ల జిల్లా చైర్మన్ భావపురి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆవల వెంకటేశ్వర్లు మరియు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా డైరెక్టర్ రోజు స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ పొందుగల ప్రసాద్ గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ విద్య మరియు సామాజిక చైతన్య కార్యక్రమాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం పైగా పోలింగ్ లక్ష్యంతో విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ బ్రోచర్ల ఆవిష్కరణకు సహకరించిన కలెక్టర్ డిపిఓ కు మున్సిపల్ కమిషనర్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla