Guntur: గుంటూరులో తొలగించిన ఓటర్లపై ప్రత్యేక ఇంటింటి సర్వే ప్రారంభం!

Guntur: గుంటూరు నగరంలో తొలగించిన ఓటర్ల జాబితాతో ప్రత్యేక ఇంటింటి సర్వే ప్రారంభం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 8 Oct 2026 12:59 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో తొలగించిన ఓటర్లపై ప్రత్యేక ఇంటింటి సర్వే ప్రారంభం!

Guntur: గుంటూరు నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు రోజుల (ఈనెల 8 నుండి 10) ప్రత్యేక డ్రైవ్..గుంటూరు నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ మయూర్ అశోక్

గురు, శుక్ర, శనివారాల్లో బిఎల్ఓలు తొలగించిన ఓటర్ల జాబితాతో నేరుగా ప్రతి ఇంటికీ వచ్చి పునః ధృవీకరణ చేస్తారు . పొరపాటున ఎవరి పేరైనా జాబితా నుండి తొలగించబడితే, వారు వెంటనే ఫారం-6 పూర్తి చేసి అందుబాటులోని బిఎల్ఓకి అందించి, మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు

ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈ నెల 16న (అక్టోబర్ 16) రాష్ట్ర వ్యాప్తంగా తుది ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. తుది జాబితాలో పేరు లేనివారు లేదా కొత్తగా అర్హత సాధించినవారు 'నిరంతర నవీకరణ ప్రక్రియ' కింద ఎప్పుడైనా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

"అర్హులైన ఏ ఒక్క ఓటరు నిరాశ చెందకూడదు.. అనర్హులకు జాబితాలో చోటు ఉండకూడదు!" అనే లక్ష్యంతో ఈ డ్రైవ్ కొనసాగుతోందన్న కమిషనర్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN