Chirala: స్టార్ హెల్త్ మోసంపై జర్నలిస్ట్ సుబ్బారావు ఆరోపణలు
Chirala: రూ.10 లక్షల పాలసీ ఉన్నా రూ.12 లక్షల గుండె చికిత్స క్లెయిమ్‌ను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తిరస్కరించిందని చీరాల సీనియర్ జర్నలిస్ట్ సుబ్బారావు ఆరోపించారు.
Chirala: స్టార్ హెల్త్ మోసంపై జర్నలిస్ట్ సుబ్బారావు ఆరోపణలు
Chirala: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారులను మోసగిస్తుందని, క్లైయిము లను చిన్న చిన్న కారణాలతో తిరస్కరిస్తుందని చీరాల కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సౌరి సుబ్బారావు ఆరోపించారు.తనకే ఈ కంపెనీ ద్వారా చేదు అనుభవం ఎదురైందని ఆయన శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.తాను ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన 10 లక్షల రూపాయలు విలువ చేసే స్టార్ ఇన్సూరెన్స్ వారి సూపర్ స్టార్ పాలసీ నెంబరు 3087112700040851 ని 40 వేల రూపాయలు ప్రీమియం కట్టి తీసుకున్నానని చెప్పారు.
మేనెల 26న చీరాలలో ఉండగా తనకు గుండెపోటు వచ్చిందని, స్థానికంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకొని ఆ రాత్రికి హైదరాబాద్ చేరుకొని 27వ తేదీ ఉదయం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరానని తెలిపారు.ఆసుపత్రిలో చేరగానే అక్కడి నుండే తనకు నగదు రహిత చికిత్స కావాలంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి సమాచారం ఇచ్చారన్నారు.అయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు నగదు రహిత చికిత్సను తిరస్కరించారన్నారు.ఇక్కడే పెద్ద మోసం జరిగిపోయిందని ఆయన ఆరోపించారు
నగదు రహిత చికిత్సను తిరస్కరించడం పాలసీ నియమనిబంధనలు ఉల్లంఘించడం అని ఆయన చెప్పారు.నగదు రహిత చికిత్సను తిరస్కరించిన ఇన్సూరెన్స్ కంపెనీ ముందు డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత రీయంబర్స్మెంట్ కు దరఖాస్తు చేసుకోమని సలహా ఇచ్చిందన్నారు.దాని ని నమ్మి 6లక్షల రూపాయల ఖర్చుపెట్టి అదే రోజు తాను హార్ట్ కు రెండు stente వేయించుకొని రియంబర్స్మెంట్ నిమిత్తం ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్లులను సమర్పించగా దాన్ని కూడా తిరస్కరించారన్నారు.
ఆ తర్వాత మరో ఆరు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఇంకో రెండు స్టెంటులు వేయించుకున్నానని చెప్పారుమొత్తం 12 లక్షల రూపాయల ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఐదు పైసలు కూడా స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వలేదని,సామాన్యులను ఆ కంపెనీ ఇలా మోసగిస్తుందని సుబ్బారావు ఆరోపించారు. అసలు నగదు రహిత చికిత్సకు ఎందుకు అంగీకరించలేదో స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పాలని డిమాండ్ చేశారు.స్టార్ కంపెనీ మోసం పై కన్జ్యూమర్ ఫోరం లో కేసు వేయనున్నట్లు ఆయన వెల్లడించారు.




