Bapatla: నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునీఠా!

Bapatla: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి. వీక్షణ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠా ఆదేశాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Oct 2026 7:13 PM IST
Bapatla
X

Bapatla: నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునీఠా!

Bapatla: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠా తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులతో సోమవారం రాష్ట్ర రాజధాని నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి హాజరయ్యారు.నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 659 మండలాలలో జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికల ప్రకటన విడుదల చేశామన్నారు. 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లను 24 గంటల్లో జారీ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఎలాంటి దుర్ఘటనలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అవసరమైన ఎన్నికల సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉండాలన్నారు. స్టాటిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు. పురపాలక సంఘాల నామినేషన్ ప్రక్రియ కొన్ని ప్రాంతాలు మినహా ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. అధికారులు సీరియస్ గా పని చేయాలన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్