Santhanuthalapadu: నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతపై కేసు నమోదు!
Santhanuthalapadu: సంతనూతలపాడు నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించేందుకు వైఎస్సార్‌సీపీ నేత మాంసం పంపిణీ యత్నాన్ని సీఐ ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు.
Santhanuthalapadu: నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతపై కేసు నమోదు!
చీమకుర్తి మండలం నిప్పట్లపాడు MPTC పరిధిలోని అయ్యప్పరాజుపాలెం గ్రామంలో ఎన్నికల గెలుపు కొరకు ఓటర్లకు ఇంటికి 1 కేజీ చొప్పున మటన్ పంపిణీ చేసేందుకు 20 పొట్టేళ్లను సిద్ధం.
సమాచారంతో అక్కడికి చేరుకున్న చీమకుర్తి CI D ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయ్యప్ప రాజుపాలెంగ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు చిన్నపరెడ్డి రమణారెడ్డి S/O కోటిరెడ్డి, 45 yrs నేతృత్వంలో యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అప్పటికే 6 పొట్టేళ్లను నరికి మాంసం ప్యాకింగ్ చేస్తుండగా పోలీసులు తక్షణమే అడ్డుకున్నారు.మిగతా 14 పొట్టేళ్ల కోతను నిలిపివేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై తగిన చర్యల నిమిత్తం స్థానిక రిటర్నింగ్ అధికారి/MPDO గారికి సమాచారం అందజేసి కేసు నమోదు చేస్తున్నారు..




