Repalle: రేపల్లె 33వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ!

Repalle: బాపట్ల జిల్లా రేపల్లె 33వ వార్డులో రిగ్గింగ్ ఆరోపణలతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ. రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 1 Nov 2026 5:28 PM IST
Repalle
X

Repalle: రేపల్లె 33వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ!

Repalle: రేపల్లె పట్టణంలోని 33వ వార్డులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా టిడిపి శ్రేణులు రిగ్గింగ్‌కు యత్నించాయంటూ వైసిపి నేతలు ఆరోపిస్తూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమై, క్షణాల్లో అది తీవ్ర ఘర్షణకు దారితీసింది.

టిడిపి, వైసిపి కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో 33వ వార్డు ప్రాంతం రణరంగంగా మారింది. ఈ సమాచారం అందుకోగానే పోలీసులు తక్షణమే రంగప్రవేశం చేశారు. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుని, ఘర్షణకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టారు.

పోలీసుల సమయోచిత స్పందనతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం 33వ వార్డులో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE