Guntur: రేపు ఇంతకంటే రెండింతలు ఎక్కువ ఉండదా?: సజ్జల హెచ్చరిక!
Guntur: గుంటూరు సబ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని ములాఖాత్‌లో పరామర్శించిన అనంతరం వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Guntur: రేపు ఇంతకంటే రెండింతలు ఎక్కువ ఉండదా?: సజ్జల హెచ్చరిక!
గుంటూరు: కూటమి ప్రభుత్వం రేపు మేము అధికారంలోకి వస్తే ఏ విధంగా చేయాలో నేర్పుతుందని వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు సబ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ని సజ్జల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్ లో సోమవారం పరామర్శించారు.
అనంతరం మీడియాతో సజ్జల, పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగలేదన్నారు. ఇవి ప్రజల తీర్పు ఇచ్చిన ఎన్నికలు అనుకుంటే కూటమి ప్రభుత్వం అవివేకం అన్నారు. ఎంత ఉప్పు తిన్నారో, అన్ని నీళ్లు తాగక తప్పదన్నారు. టీడీపీ ముసుగులో పోలీసులే అక్రమ ఎన్నికలు జరుపుతున్నారని విమర్శించారు.




