Guntur: పాడి రైతులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం!

Guntur: పాడి రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని గుంటూరు రూరల్ రైతు సంఘం కార్యదర్శి ఇమ్మడి రామారావు విమర్శించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 10 Oct 2026 8:09 AM IST
Guntur
X

Guntur: పాడి రైతులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం!

Guntur: శుక్రవారం గుంటూరు రూరల్ లోనే జొన్నలగడ్డ, తాటిరెడ్డిపాలెం గ్రామాల్లో పాల రైతుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పంట రైతుకు రెండు కళ్ళు లాంటివి. పంట దెబ్బతిన్నప్పుడు పాడి మీద కుటుంబ పోషణ సాగించుకునే పద్ధతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నదన్నారు. ప్రధానంగా సన్నా, చిన్న కౌలు రైతులు కు జీవణంగా ఉందన్నారు.

కొందరు చదువుకున్న యువకులు కూడా పాడి పరిశ్రమపై ముగ్గు చూపుతున్నారన్నారు. కాని దీని తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించట్లేదన్నారు. రెండు లక్షల పైగా గేద రేట్లు ఉండగా దాని పోషణకు ఖర్చులు మొత్తం లెక్కల కట్టినట్లయితే లీటర్ కు వంద రూపాయలు వస్తేనే పాడి రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు.

కానీ వంద రూపాయల్లో రాక గిట్టుబాటు గాక చాలామంది పాడి రైతులు వదిలేస్తున్నారన్నారు. గ్రామాల్లో పాల కేంద్రాల వద్ద పాలు పోసే వారి కంటే పాలు కొనుగోలు చేసుకునే వారి సంఖ్య పెరిగిందన్నారు. దీంతో పట్టణ ప్రాంతాల నుంచి పాలు తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అధిక రేట్లకు అమ్ముతున్నారన్నారు. కల్తీ పాలు కూడా ఉన్నాయి అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పాలు దొరక్క తీవ్ర ఇక్కట్లు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం రానున్న కరువు రీత్యా ముందుగానే పశువులకు సబ్సిడీ లో రుణాల అందించటం అదేవిధంగా దాణా ఎండు గడ్డి లాంటివి ఉచితంగా సరఫరా చేయటం, ఇన్సూరెన్స్ ఉచితంగా చేయడం, మందులు ఉచితంగా ఇచ్చి డాక్టరు గ్రామంలో అందుబాటులో ఉండ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యలపై రేపు పాల రైతుల జిల్లా మహాసభ తెనాలిలో జరుగునున్నదని పాల్ రైతులందరూ హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జొన్నల కోటిరెడ్డి, వెంకటయ్య, లక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN