Prathipadu: మేకతోటి సుచరితను కలిసిన ప్రత్తిపాడు ఎంపీటీసీ-2 తన్నీరు నీరజ
Prathipadu: ప్రత్తిపాడు ఎంపీటీసీ-2గా ఎన్నికైన తన్నీరు నీరజ దంపతులు గుంటూరులో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను కలవగా, ఆమె వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.
Prathipadu: మేకతోటి సుచరితను కలిసిన ప్రత్తిపాడు ఎంపీటీసీ-2 తన్నీరు నీరజ
గుంటూరు: గుంటూరు పట్టణంలోని మాజీ హోం శాఖామాత్యులు వారి కార్యాలయం నందు ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం & ప్రత్తిపాడు గ్రామ MPTC-2 గెలుపొందిన శ్రీమతి తన్నీరు నీరజ గారి దంపతులు మరియు గ్రామ ముఖ్యనాయకులు మాజీ హోం శాఖామాత్యులు మరియు పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి మేకతోటి సుచరిత, గారిని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం సుచరిత గారు MPTC-2 గెలుపొందిన తన్నీరు నీరజ గారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు గ్రామ ముఖ్యనాయకులు మాజీ సర్పంచులు శ్రీ చాగంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ మూలే శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఉప సర్పంచి బాపతు వెంకటేశ్వరరెడ్డి గారు, ప్రత్తిపాడు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు శ్రీ గుజ్జుల శివారెడ్డి గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీ చాగంరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి గారు, ప్రత్తిపాడు మండల యూత్ అధ్యక్షులు శ్రీ బాపతు గోవిందరెడ్డి గారు, జిల్లా నాయకులు శ్రీ చేపర్తి లక్ష్మణ్ గారు, శ్రీ బత్తుల కొండయ్య గారు, శ్రీ కసిరెడ్డి కృష్ణారెడ్డి గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు, మాజీ వార్డ్ సభ్యులు శ్రీ సాగర్ గారు, శ్రీ పోతురాజు గారు, శ్రీ చిన్నగారు, మాజీ ఎం.పి.టి.సి.గురుగూరి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ నోటు కొండా రెడ్డి గారు, మాజీ వార్డ్ సభ్యులు శ్రీ సయ్యద్ బాషాగారు, తదితరులు పాల్గొన్నారు.




