Prathipadu: ఐటీడీపీ సభ్యులతో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు లీడర్షిప్ కాంక్లేవ్
Prathipadu: గుంటూరులో ఐటీడీపీ సభ్యులతో లీడర్షిప్ కాంక్లేవ్ నిర్వహించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు. సోషల్ మీడియా వ్యూహాలపై దిశానిర్దేశం.
Prathipadu: ఐటీడీపీ సభ్యులతో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు లీడర్షిప్ కాంక్లేవ్
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఐటీడీపీ (iTDP) సభ్యులకు లీడర్షిప్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహించి, వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మన ఊరు మన ఎమ్మెల్యే పాస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ డిజిటల్ ప్రచార వ్యూహాలు, సోషల్ మీడియా మరియు మై టిడిపి యాప్ వేదికల వినియోగం, ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై చర్చించారు.
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం, పార్టీ సిద్ధాంతాలను మరియు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, బాధ్యతాయుతమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఐటీడీపీ ఛాంపియన్స్ పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు, ఐటిడిపి నాయకులు పంచుమర్తి శేషు, నవీన్, మండల పార్టీ ప్రెసిడెంట్లు ,నియోజకవర్గంలోని వివిధ స్థాయిల ఐటిడిపి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.




