Prakasam: సంతనూతలపాడులో చెరువు పూడికతీత పనులను పరిశీలించిన DWMA పీడీ!

Prakasam: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఎండ్లూరులో ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పెద్ద చెరువు పూడికతీత పనులను DWMA పీడీ వెంకటేశ్వరరావు పరిశీలించారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 7 Oct 2026 12:32 PM IST
Prakasam
X

Prakasam: సంతనూతలపాడులో చెరువు పూడికతీత పనులను పరిశీలించిన DWMA పీడీ!

Prakasam: జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ M. వెంకటేశ్వరరావు ఈరోజు సంతనూతలపాడు ఎండ్లూరు గ్రామంలో VBG-RAM G పథకం ద్వారా జరుగుతున్న పెద్ద చెరువు పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పనుల పురోగతిని పరిశీలించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, పనుల్లో పాల్గొంటున్న శ్రామికులతో (Wage Seekers) నేరుగా మాట్లాడి వారికి కల్పిస్తున్న పనిదినాలు, పని పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యల గురించి వివరాలు తెలుసుకున్నారు.

కేటాయించిన కొలతల ప్రకారం పని పూర్తి చేసినట్లయితే రోజువారీ కూలీగా రూ.312/- చెల్లించబడుతుందని శ్రామికులకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు తెలియజేశారు. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

VB-GRAM G సిబ్బంది కూడా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొని, జరుగుతున్న పనుల పురోగతి మరియు పనులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేశారు.

చెరువుల పూడికతీత ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు, వర్షపు నీటిని సమర్థవంతంగా నిల్వ చేసుకోవడానికి, భూగర్భ జలాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సహజ నీటి వనరుల పరిరక్షణకు ఇలాంటి పనులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఉపాధి హామీ పనుల్లో నాణ్యత, పారదర్శకత, కూలీలకు సకాలంలో ఉపాధి కల్పించడం, పనులకు అనుగుణంగా కూలి చెల్లింపులు జరిగేలా చూడటం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత సిబ్బందికి ప్రాజెక్ట్ డైరెక్టర్ సూచించారు.

పనులు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నాణ్యతతో పూర్తి చేయడంతో పాటు, శ్రామికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో గౌరవ MPDO ,మండల సిబ్బంది, APO, VB-GRAM G సిబ్బంది మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam