Guntur: గుంటూరులో పోలింగ్ సిబ్బంది కోసం 27, 28 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం!

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది కోసం ఏసీ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు. ఈ నెల 27, 28 తేదీల్లో ఓటు హక్కు వినియోగం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Oct 2026 6:36 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో పోలింగ్ సిబ్బంది కోసం 27, 28 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం!

Guntur: గుంటూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ విధులు కేటాయించబడి, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఓటు హక్కు కల్గిన సిబ్బంది అందరూ ఈ నెల 27, 28 తేదీల్లో ఏసి కాలేజీలో ఏర్పాటు చేస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తమ పోస్టల్ బ్యాలెట్ హక్కును వినియోగించుకోవాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పోలింగ్ సిబ్బంది సౌకర్యార్థం ఏసీ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ కోసం 26 కౌంటర్లను ఏర్పాటు చేశామని, 27 మరియు 28 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వారు తమ ఎపిక్ లేదా తగిన ఫోటో గుర్తింపు కార్డు, ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వులను చూపించి ఓటుని ధృవీకరించుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియలో పూర్తి గోప్యత పాటించేలా ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశామని, ఈ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే, ఓటర్లకు సహాయం చేయడానికి హెల్ప్ డెస్క్, ధృవీకరణ (అటెస్టేషన్) కోసం సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని, పోలింగ్ విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN