Gurazala: గురజాల వైసీపీ ఆఫీస్ వద్ద లాఠీఛార్జ్: ఉద్రిక్తత
Gurazala: గురజాల వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి నామినేషన్లకు వెళ్తున్న క్యాడర్‌పై లాఠీఛార్జ్ చేశారు. మురళీధర్ రెడ్డి సహా ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు.
Gurazala: గురజాల వైసీపీ ఆఫీస్ వద్ద లాఠీఛార్జ్: ఉద్రిక్తత
గురజాల: గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో వైసిపి కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఎంపీపీ, ఎంపీటీసీ వైసిపి పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేయటానికి వెళ్తున్న అభ్యర్థులను, ముఖ్య నాయకులు, కార్యకర్తలను, అడ్డుకున్న పోలీసులు. 144 సెక్షన్ అమల్లో ఉందని గుంపులుగా వెళ్లకూడదని వైసీపీ క్యాడర్ ని అడ్డుకున్న పోలీసులు మేము నామినేషన్ వేసేందుకు వెళ్తున్నామని అని చెప్పిన వినిపించుకొని పోలీసులు. దీంతో రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు వైసిపి అభ్యర్థులు పై, నాయకులపై, కార్యకర్తలపై, లాఠీ ఛార్జ్ చేశారు.
తీవ్ర ఉద్రక్తత పరిస్థితిలో వైసిపి పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వై మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు (kv), మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డి, తదితర ముఖ్య నాయకులను అరెస్ట్ చేశారు.




