Guntur: గుంటూరులో టపాసుల దుకాణాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Guntur: దీపావళి పండుగ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తాడేపల్లి, మంగళగిరి, నగరంపాలెం పరిధిలోని టపాసుల దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Oct 2026 10:17 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో టపాసుల దుకాణాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

గుంటూరు: దీపావళి పండుగ నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తాడేపల్లి, మంగళగిరి రూరల్, నగరంపాలెం పోలీస్‌స్టేషన్ల పరిధిలోని టపాసుల హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు, నిల్వ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, అనుమతులను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణ యజమానులను హెచ్చరించారు. తనిఖీల్లో వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, సీఐలు రాజేష్, సీహెచ్. వెంకట్, వీరేంద్రబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN