Pedakakani: పెద్దకాకానిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీసుల కౌన్సిలింగ్!
Pedakakani: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్. నేరాలకు దూరంగా ఉండాలని సీఐ నారాయణస్వామి హెచ్చరిక.
Pedakakani: పెద్దకాకానిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీసుల కౌన్సిలింగ్!
Pedakakani: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, ఇకపై ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. చెడు స్నేహాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ కుటుంబాల భవిష్యత్తును, సమాజంలో తమ గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ముందస్తు బైండోవర్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, నేరాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవనం సాగించే వారికి పోలీసుల తరఫున అవసరమైన సహకారం అందిస్తామని అధికారులు తెలిపారు. నేరరహిత సమాజ నిర్మాణం, ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.




