Podili: ఆర్టీసీ బస్సు ఆలస్యం: పొదిలిలో విద్యార్థుల ఆందోళన

Podili: మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌లో అన్నవరం వెళ్లే విద్యార్థుల ప్రత్యేక బస్సు ఆలస్యం కావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

MADARVALI, MARKAPURAM
Published on: 24 Sept 2026 7:16 PM IST
Podili
X

Podili: ఆర్టీసీ బస్సు ఆలస్యం: పొదిలిలో విద్యార్థుల ఆందోళన

పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి అన్నవరం గ్రామానికి పాఠశాల విద్యార్థుల కోసం ప్రతిరోజూ ప్రత్యేకంగా నడిచే బస్సు గురువారం ఆలస్యంగా రావడంతో విద్యార్థులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు.

ప్రతిరోజు మాదిరిగానే సమయానికి బస్సు వస్తుందని విద్యార్థులు బస్టాండ్‌లో వేచి ఉండగా, ఎంతసేపటికీ బస్సు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఈ విషయంపై ఆర్టీసీ విచారణ కేంద్రంలో ఆరా తీసినప్పటికీ స్పష్టమైన సమాచారం అందకపోవడంతో విద్యార్థుల్లో మరింత ఆందోళన నెలకొంది.

విద్యార్థుల ఆందోళనను గమనించిన ఆర్టీసీ సిబ్బంది ఎట్టకేలకు బస్సును ప్లాట్‌ఫాంపైకి తీసుకురావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రతిరోజూ నడిచే బస్సు సమయానికి ఎందుకు రాలేదో అధికారులు పరిశీలించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఒకవేళ బస్సు అరగంట ఆలస్యమవుతుందని ముందుగానే విచారణ కేంద్రం ద్వారా సమాచారం అందించినా తమలో ఆందోళన ఉండేది కాదని వారు తెలిపారు. ఇకపై బస్సుల రాకపోకలపై స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు సమయపాలన పాటించేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM