Vinukonda: వినుకొండలో లబ్ధిదారులకు పీఎంఏవై ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత!
Vinukonda: వినుకొండ పట్టణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను అందజేశారు.
Vinukonda: వినుకొండలో లబ్ధిదారులకు పీఎంఏవై ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత!
Vinukonda: ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసి, పక్కా ఇల్లు అందించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, గృహ నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు.
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను జీవీ ఆంజనేయులు అందజేశారు. అనంతరం ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి, ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత, వేగం, నాణ్యతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. PMAY 2.0 పథకం అమలులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో గృహ నిర్మాణాలు చేపట్టలేదని ఆరోపించారు.
అంతేకాకుండా, ఆరు లక్షల ఇళ్లను రద్దు చేసి పేదల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు.కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని జీవీ ఆంజనేయులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




