Piduguralla: పిడుగురాళ్ల మహిళ హత్య కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్!

Piduguralla: పిడుగురాళ్లలో మహిళ హత్య కేసును ఛేదించి నిందితుడు బత్తుల గోవిందును అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన గురజాల డిఎస్పీ మహేశ్వరరావు.

KOMMA MAHESH, PIDURURALLA
Published on: 12 Oct 2026 1:44 PM IST
Piduguralla
X

Piduguralla: పిడుగురాళ్ల మహిళ హత్య కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్!

Piduguralla: పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో కూరగాయల కొట్టు వద్ద అక్టోబర్ 8వ తారీకు మధ్యాహ్నం సుమారు 12:15 నిమిషాలకు సమయంలో అచ్చంపేట మండల వేల్పురు గ్రామానికి చెందిన తమ్మీశెట్టి సుజాత అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళుతుండగా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బత్తుల గోవిందు 63 సంవత్సరాలు అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడని ఈ దాడికి అడ్డుకోబోయిన మృతురాలి పెద్దమ్మ దేవల పార్వతమ్మ ను కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు.

బత్తుల గోవిందు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా పిడుగురాళ్ల పట్టణంలోని శివారులోని కొండముడు రోడ్డు శ్రీ లక్ష్మీబార్ సమీపంలో నిందితుడు పోలీసులు చూసి పారిపోవటానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారన్నారు.

విచారణలో భాగంగా నిందితుడు బత్తుల గోవిందు తన నేరాన్ని అంగీకరించాడని మృతురాలు సుజాత నాలుగు సంవత్సరాల నుండి సహజీవనం చేస్తూ, ఇప్పటికి మూడు నెలలుగా దూరంగా ఉంటుందని వేరే వ్యక్తితో చనువుగా తిరుగుతుందని కక్షతోనే ముందస్తు ప్రకారం తన హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నాడు అన్నారు.

నిందితుడు ఇచ్చిన సమాచారం మరియు స్వచ్ఛంద వాంగ్మూలం ప్రకారం నేరం చేయడానికి ఉపయోగించిన కత్తిని పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారన్నారు.

ఈ కేసును చేదించడంలో పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ సిఐ వెంకట్రావు ఎస్సై మోహన్, ఎస్సై శివనాగరాజు, సిబ్బంది కీలకపాత్ర పోషించారని గురజాల డిఎస్పి మహేశ్వరరావు అభినందించారు.

KOMMA MAHESH, PIDURURALLA

KOMMA MAHESH, PIDURURALLA