Pedakurapadu: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు!
Pedakurapadu: అచ్చంపేట-క్రోసూరు రోడ్డులో ప్రమాదం మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు క్షతగాత్రులను సొంత కారులో ఆసుపత్రికి తరలింపు, 108 తీరుపై తీవ్ర ఆగ్రహం.
Pedakurapadu: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు!
పెదకూరపాడు: అచ్చంపేట క్రోసూరు రహదారి లో రోడ్డు ప్రమాదం లో గాయపడిన క్షత గాత్రులను పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు దగ్గర ఉండి సొంత కారులో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి మానవత్వం చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, క్రోసూరు నుండి అచ్చంపేట వెళ్తున్న తరుణంలో జరిగిన రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయారు.
108 కి కాల్ చేసినప్పటికి సకాలంలో స్పందించకపోవడం తో రోడ్డు ప్రమాదం లో గాయపడిన వారిని తన సిబ్బంది సహాయం తో సొంత కారులో అచ్చంపేట ప్రభుత్వం ఆసుపత్రి తరలించారు. అచ్చంపేట అసుపత్రి నుండి సత్తెనపల్లి ఆసుపత్రి కి తరలించడానికి అంబులెన్సు లో క్షత గాత్రులను ఎక్కించగా టైర్ లో గాలి లేదని నిర్లక్ష్యంగా 108 సిబ్బంది ఉండటం తో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వారి పై అత్యవసర పరిస్థితి లో కూడా 108 లో సదుపాయాలు లేక సిబ్బంది ఇలా వ్యవహరించడం చాలా దుర్మార్గం అని అసహనం వ్యక్తపరిచారు.




