Pedakakani: పెదకాకానిలో వరుస చోరీల గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్
Pedakakani: పెదకాకాని లూథర్‌గిరి కాలనీలో జరిగిన వరుస ఇళ్ల దొంగతనాల కేసులను పోలీసులు 24 గంటల్లో ఛేదించి ఇద్దరు నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
Pedakakani: పెదకాకానిలో వరుస చోరీల గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్
పెదకాకాని: పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని లూథర్‌గిరి కాలనీలో జరిగిన వరుస ఇళ్ల దొంగతనం కేసులను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నార్త్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
కూరపాటి సంతోష్ కుమార్, కూరపాటి సరితలను అరెస్ట్ చేసి, మూడు కేసుల్లో చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. నిందితులు ముందుగా ఇళ్ల తాళాలు దొంగిలించి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే తాళాలతో ప్రవేశించి చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.




