Palnadu: కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన అమరేశ్వర ఆలయం!

Palnadu: కార్తీక పౌర్ణమి సందర్భంగా పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 24 Nov 2026 9:45 AM IST
Palnadu
X

Palnadu: కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన అమరేశ్వర ఆలయం!

పల్నాడు: కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతిలోని శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ.. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు.

కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా..ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.భక్తి శ్రద్ధలతో అమరేశ్వర స్వామిని దర్శించుకుంటూన్నారు.

.అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయం భక్తి పారవశ్యంతో కళకళలాడుతోంది. క్యూ లైన్ లోనే భక్తులకు మంచినీటి సౌకర్యం మరియు స్నానం చేసేందుకు నదిలో దిగకుండా నీటి తుంపర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU