Nuzendla: నూజెండ్లలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి విజయం కోసం జీవీ ప్రచారం

Nuzendla: వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రచారం. జనసేన జడ్పీటీసీ అభ్యర్థి బాలప్రసాద్‌ను గెలిపించాలని పిలుపు.

KAREEMULLA, VINUKONDA
Published on: 2 Nov 2026 6:41 PM IST
Nuzendla
X

Nuzendla: నూజెండ్లలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి విజయం కోసం జీవీ ప్రచారం

నూజెండ్ల: వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి విజయం లక్ష్యంగా ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని త్రిపురాపురం, గొల్లపాలెం, ములకలూరు, పువ్వాడ, కొండలరాయుడుపాలెం గ్రామాల్లో పర్యటిస్తూ జనసేన పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట బాలప్రసాద్‌కు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు.

కూటమి ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షమైన జనసేన అభ్యర్థి వెంకట బాలప్రసాద్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జీవీ ఆంజనేయులు కోరారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. కూటమి పార్టీల మధ్య ఉన్న ఐక్యతే తమ ప్రధాన బలమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొనసాగాలంటే కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు 2029లో మరోసారి ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA