Guntur: గుంటూరు జిల్లాలో అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Guntur: గుంటూరు జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభంకానుందని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 30 Sept 2026 7:12 PM IST
Guntur
X

Guntur: గుంటూరు జిల్లాలో అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Guntur: గుంటూరు జిల్లాలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుండి జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అక్టోబర్ 1వ తేదీన పింఛను తీసుకోలేని వారికి అక్టోబర్ 3వ తేదీన అందజేస్తారని చెప్పారు. ఎస్.జీ.ఎస్.డబ్ల్యూ, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకుల నుండి నగదు పొందడం, సిబ్బందిని మ్యాపింగ్ చేయడం, పంపిణీ సక్రమంగా, సాఫీగా జరుగుటకు సరైన పర్యవేక్షణ, కార్యాచరణ తయారు చేసి సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2,50,576 మందికి పింఛన్లు క్రింద 109.32 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుందని చెప్పారు. పంపిణీ సమయంలో ఎటువంటి లోపాలు లేకుండా సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని చెప్పారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN