Guntur: గుంటూరులో కదం తొక్కిన కూటమి శ్రేణులు. సంగడిగుంటలో పసుపు సందడి!
Guntur: గుంటూరు కూటమి మేయర్ అభ్యర్థి అపర్ణకు మద్దతుగా సంగడిగుంటలో భారీ ర్యాలీ. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, భీమనాదం భరత్ రెడ్డి హాజరు.
Guntur: గుంటూరులో కదం తొక్కిన కూటమి శ్రేణులు. సంగడిగుంటలో పసుపు సందడి!
Guntur: గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతుగా తెలుగుదేశం యువ నాయకుడు భీమనాదం భరత్ రెడ్డి ఆధ్వర్యంలో సంగడిగుంట ప్రాంతంలో ఆత్మీయ సమావేశం, భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత భీమనాదం భరత్ రెడ్డి నివాసంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు పాల్గొని లక్ష్మీ అపర్ణ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం సిమ్స్ కాలేజీ నుంచి సంగడిగుంటలోని భీమనాదం భరత్ రెడ్డి నివాసం వరకు భారీ కాన్వాయ్‌తో ర్యాలీ నిర్వహించారు. ఈ కాన్వాయ్‌లో తెలుగుదేశం యువ నాయకుడు భీమనాదం భరత్ రెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు.
ర్యాలీకి స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ర్యాలీ సాగిన మార్గంలో ప్రజలు రహదారులపై నిలబడి లక్ష్మీ అపర్ణకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ తమ మద్దతు ప్రకటించారు. దీంతో సంగడిగుంట ప్రాంతమంతా పసుపుమయంగా మారగా, ర్యాలీ సాగిన మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా భీమనాదం భరత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను భారీ మెజారిటీతో గెలిపించేందుకు తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి కూటమి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు.
లక్ష్మీ అపర్ణ విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తామని నేతలు స్పష్టం చేశారు. సంగడిగుంటలో ప్రజలు పలికిన ఘన స్వాగతం, ర్యాలీలో కనిపించిన ఉత్సాహం ఎన్నికల ప్రచారానికి మరింత ఊపునిచ్చాయి.




