Guntur: సోషల్ అవేర్‌నెస్ కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి!

Guntur: గోరంట్లలోని కేంబ్రిడ్జ్ కాలేజీ విద్యార్థులతో సమావేశమైన ఎన్డీయే కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ. విద్యార్థులకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని పిలుపు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Oct 2026 12:27 PM IST
Guntur
X

Guntur: సోషల్ అవేర్‌నెస్ కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి!

Guntur: గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గోరంట్లలోని కేంబ్రిడ్జ్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కాలేజీ సిబ్బందితో ఆమె ఆత్మీయంగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం సామాజిక స్పృహకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలని సూచించారు. “సోషల్ అవేర్‌నెస్ కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యతను గుర్తించి, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ, సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి, అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంబ్రిడ్జ్ కాలేజీ చైర్మన్ సాధినేని నరేంద్రతో పాటు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN