Guntur: జాతీయ వికసిత్ భారత్ పోటీలో కిట్స్ విద్యార్థుల ప్రతిభ

Guntur: జాతీయ స్థాయిలో నిర్వహించిన 'వికసిత్ భారత్ @2047' లోగో డిజైన్ పోటీలో గుంటూరు వింజనంపాడు కిట్స్ విద్యార్థులు ప్రతిభ చాటి రూ.లక్ష చొప్పున నగదు గెలుచుకున్నారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 17 Sept 2026 7:49 PM IST
Guntur
X

Guntur: జాతీయ వికసిత్ భారత్ పోటీలో కిట్స్ విద్యార్థుల ప్రతిభ

గుంటూరు జిల్లా: కేకేఆర్ అండ్ కేఎస్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (KITS)లోని విద్యార్థులకు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ @2047’ లోగో డిజైన్ పోటీలో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు తమ సృజనాత్మక లోగోలను సమర్పించారు. దేశవ్యాప్తంగా వచ్చిన అనేక లోగోల్లో కిట్స్ విద్యార్థులు రూపొందించిన లోగో ఎంపిక కావడం కళాశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపికైన ఇద్దరు విద్యార్థులను డాక్టర్ ఎలియా తగరం

నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యనిర్వాహక డైరెక్టర్, న్యూ ఢిల్లీ ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు రూ.1,00,000 చొప్పున నగదు బహుమతి చెక్కులను అందజేయడంతో పాటు, శాలువాలతో సత్కరించి వారి ప్రతిభను అభినందించారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కోయ సుబ్బారావు గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో కిట్స్ కు చెందిన ఇద్దరు విద్యార్థుల లోగో ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కళాశాల సెక్రటరీ శ్రీ కోయ శేఖర్ గారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టుకుంటూ తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కాలానికి అనుగుణంగా ఆలోచనల్లో మార్పు తెచ్చుకున్నప్పుడే సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. బాబు గారు మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు, ప్రతిభకు కళాశాల ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు గారు వివిధ విభాగాధిపతిలు, ప్రతిభ చాటిన విద్యార్థుల తల్లితండ్రులు మరియు ఇతర అధ్యాపక, సిబ్బంది పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభకు ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU