Guntur: గుంటూరు లలితా పీవీఎస్ ఆసుపత్రిలో ప్రత్యేక ‘స్ట్రోక్ యూనిట్’ ప్రారంభం!
Guntur: గుంటూరు లలితా పీవీఎస్ ఆసుపత్రిలోని బ్రెయిన్ & స్పైన్ సెంటర్‌లో ప్రత్యేక స్ట్రోక్ యూనిట్‌ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం ప్రారంభించారు.
Guntur: గుంటూరు లలితా పీవీఎస్ ఆసుపత్రిలో ప్రత్యేక ‘స్ట్రోక్ యూనిట్’ ప్రారంభం!
గుంటూరు: గుంటూరులోని తక్కెలపాడు బైపాస్ సమీపంలో లలితా పీవీసీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లలిత బ్రెయిన్ & స్పైన్ సెంటర్ లో స్ట్రోక్ యూనిట్‌ను ప్రారంభించిన నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు.
ఈ సందర్భంగా గుండెపోటు తరహాలోనే బ్రెయిన్ స్ట్రోక్ పట్ల కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం 30 ఏళ్ల వయసులోనే ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో యువత కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందాలని, సకాలంలో చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ పి.వి. రాఘవ శర్మ, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, సీఎంసీ లూధియానాలో న్యూరాలజీ విభాగాధిపతి మరియు ప్రిన్సిపల్/డీన్ డాక్టర్ జయరాజ్ డి. పాండియన్, డాక్టర్ పి. విజయ న్యూరోసైన్సెస్ విభాగాధిపతి మరియు ఆసుపత్రి వైద్య బృందం పాల్గొన్నారు.




