Nagandla: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు!

Nagandla: పర్చూరు నియోజకవర్గం నాగండ్లలో వైసీపీకి బిగ్ షాక్. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో 12 కుటుంబాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరిక.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 24 Oct 2026 9:09 PM IST
Nagandla
X

Nagandla: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు!

నాగండ్ల: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో నాగండ్లకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మొత్తం 12 కుటుంబాలకు చెందిన వారిని ఎమ్మెల్యే ఏలూరి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించడంతోపాటు అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తుండటంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.నాగండ్లలోని ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ముతోటి నరసయ్య, కొమ్ముతోటి సంగీతరావు, నూతలపాటి వీరయ్య, స్టాలిన్, నూతలపాటి ఏసుపాదం, నూతలపాటి ఆదిశేషు, వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు కామేశ్వరరావు, పల్లపు సుబ్బారావు, తన్నీరు అంకమ్మరావు, గుర్రం రామాంజనేయులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూరి బ్రహ్మయ్య, ఈదర వెంకటేశ్వర్లు, వీరగంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala