Nadendla: ఇర్లపాడులో భారీ అగ్నిప్రమాదం.. 14 ఎకరాల తోట దగ్ధం

Nadendla: నాదెండ్ల మండలం ఇర్లపాడులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 ఎకరాల సుబాబుల్, జామాయిల్ తోటలు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 1 Sept 2026 4:14 PM IST
Nadendla
X

Nadendla: ఇర్లపాడులో భారీ అగ్నిప్రమాదం.. 14 ఎకరాల తోట దగ్ధం

నాదెండ్ల: నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఆకతాయిలు పెట్టిన నిప్పు కారణంగా తోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక సుబాబుల్, జామాయిల్ తోటల్లో మంటలు వేగంగా వ్యాపించాయి. తోటల పక్కన ఉన్న సుమారు 50 నీటి పైపులు మంటల్లో కాలిపోయాయి.

ఎండ తీవ్రతకు తోడు గాలుల ప్రభావంతో మంటలు క్షణాల్లో చుట్టుపక్కలకు వ్యాపించాయి. సుమారు 14 ఎకరాల మేర ఉన్న సుబాబుల్, జామాయిల్ తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. చేతికందిన పంట కళ్లముందే కాలిబూడిద కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది. మంటలు మరింతగా వ్యాపించకుండా సకాలంలో చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదంతో రైతులకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

మొత్తం ఎంత నష్టం జరిగిందన్నది అధికారుల అంచనాలో తేలాల్సి ఉంది. తోటలకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story