Repalle: రేపల్లె మున్సిపాలిటీలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్!

Repalle: బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపాలిటీలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్. మొత్తం 37,008 మంది ఓటర్లు కాగా, మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది.

VIJAYA KISHORE, REPALLE
Published on: 1 Nov 2026 8:14 AM IST
Repalle
X

Repalle: రేపల్లె మున్సిపాలిటీలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్!

Repalle: రేపల్లె మున్సిపాలిటీలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ పీఠం దక్కించుకునేందుకు తీవ్ర పోటీ! మున్సిపల్ పరిధిలో మొత్తం 37,008 మంది ఓటర్లు. మహిళా ఓటర్లు: 19,521. పురుష ఓటర్లు: 17,483. ఇతరులు: 4. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో, వీరి ఓట్లే గెలుపోటములను శాసించే కీలక అంశంగా మారనున్నాయి.

మున్సిపల్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలు. రేపల్లె మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందడుగు. మరోవైపు, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది.

వార్డుల వారీగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి పోరును ఆసక్తికరంగా మాచిన ఇరు పార్టీలు. పోలింగ్ నమోదు శాతం పెంచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. అటు కూటమి, ఇటు వైసీపీ నేతలు తమ అభ్యర్థుల విజయానికై ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE