Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో ఎమ్మార్పీఎస్ ధర్నా సిఇసి రాజీనామాకు డిమాండ్
Guntur: దేశంలో ప్రజాస్వామ్యాన్ని సిఇసి అపహాస్యం చేశారని ఎమ్మార్పీఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య మండిపడ్డారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద దళిత సంఘాలు నిరసన తెలిపాయి.
Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో ఎమ్మార్పీఎస్ ధర్నా సిఇసి రాజీనామాకు డిమాండ్
గుంటూరు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఛీఫ్ ఎన్నికల కమీషన్ అపహాస్యం చేసారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మండిపడ్డారు.
కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ దళిత ప్రజాసంఘాల నాయకులు కలెక్టరేట్ లో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ..దేశంలో సామాన్యుల ఓట్లను తొలగించి వారి వ్యక్తిత్వ స్వేచ్చను ఎన్నికల సంఘం హరిస్తుందన్నారు.
సర్ ప్రక్రియ పై దేశవ్యాప్తంగా యువత ఆంధోళన చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం అడ్డుకోవటం సరైన విధానం కాదన్నారు. ఈ కార్యక్రమం లో దళిత, బహుజన, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.




