Bapatla: సంఘటన స్థలంలోనే శాస్త్రీయ ఆధారాల సేకరణ!
Bapatla: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాల సేకరణను వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ ఉమామహేశ్వర్.
Bapatla: సంఘటన స్థలంలోనే శాస్త్రీయ ఆధారాల సేకరణ!
Bapatla: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాల సేకరణను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాన్ని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. నేర స్థలంలోనే ఆధారాలను సేకరించి, భద్రపరిచి శాస్త్రీయంగా విశ్లేషించేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది. దీనివల్ల నేర పరిశోధనలో సాంకేతికత వినియోగం మరింత పెరగడంతో పాటు కేసుల దర్యాప్తులో కీలకమైన శాస్త్రీయ ఆధారాల సేకరణ వేగవంతం కానుంది.




