Guntur: టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకుల నుంచి అర్జీల స్వీకరణ

Guntur: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. టీడీపీ ఆఫీస్‌లో అర్జీలు స్వీకరించి, ఆలయంలో అన్నదానం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 11 Nov 2026 7:05 PM IST
Guntur
X

Guntur: టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకుల నుంచి అర్జీల స్వీకరణ

గుంటూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని, పార్టీ శ్రేణులకు నిరంతరం అండగా నిలవడమే తమ ప్రాధాన్యత అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల గ్రీవెన్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా వినతి పత్రాలు, అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారి కష్టసుఖాల్లో పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు.

అమ్మవారి సన్నిధిలో అన్నదానం

గుంటూరు పట్టాభిపురం జ్యూట్ మిల్లు ఎదురుగా ఉన్న శ్రీ కలకత్తా దక్షిణ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN