Guntur: మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తాం!

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 139వ జయంతి వేడుకలు. షాదీఖానా వద్ద విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 11 Nov 2026 1:25 PM IST
Guntur
X

Guntur: మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తాం!

Guntur: అత్యన్నతన విద్యా విధానంతో ముందుకు సాగుతున్న భారతదేశానికి మొట్టమొదటి అడుగు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, అటువంటి మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

బుధవారం స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గ 139వ జయంతి వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం (శ్రీనివాసరావుపేట)లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... దేశానికి ఆదర్శప్రాయమైన పరిపాలన అందించిన ఎందరో మహనీయుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అగ్రగణ్యులని, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు.

నేడు ఆధునిక విద్యా విధానంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారతదేశానికి మొట్టమొదటి పునాది రాయి, బలమైన అడుగు ఆయన ఆలోచనలతోనే పడిందని, రానున్న నాయకులు, భావితరాల ప్రజలు ఆయన జీవిత చరిత్రను, ఆదర్శాలను తప్పక తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.

ఈ స్ఫూర్తిని ముందుతరాలకు అందించేందుకు రానున్న రోజుల్లో విద్యార్థులకు వ్యాసరచన, సంగీత పోటీలు నిర్వహిస్తామని, అలాగే నియోజకవర్గ మైనారిటీ నేతలు, కార్యకర్తల ఆకాంక్ష మేరకు స్థానిక షాదీఖానా వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన పేరు మీద ఒక ఆర్చ్‌ను కూడా నిర్మిస్తామని, ఈ ఏడాది కాలంలోనే ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీ ఇచ్చారు.

ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే ఆదర్శ నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ అభ్యర్థులు, మైనారిటీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జీలు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN