Guntur: పొన్నూరులో వీరబ్రహ్మేంద్ర విగ్రహావిష్కరణ!
Guntur: పొన్నూరు 18వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఆవిష్కరించారు.
Guntur: పొన్నూరులో వీరబ్రహ్మేంద్ర విగ్రహావిష్కరణ!
Guntur: పొన్నూరు పట్టణంలోని 18వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పొన్నూరు శాసనసభ్యులు, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆశీర్వచనాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, కాలజ్ఞాన కర్తగా ప్రసిద్ధి చెందిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య బోధనలు, ప్రవచనాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా సమానత్వం, సామాజిక సమరసత, మానవతా విలువలను చాటిచెప్పిన మహనీయుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారని అన్నారు. స్వామివారి ఆశయాలను, బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆకాంక్షించారు.
ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తులలో ఆధ్యాత్మిక భావనను మరింత పెంపొందించాలని, ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆకాంక్షించారు.




