Guntur: అయ్యప్ప సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ లక్ష్మీ అపర్ణ!
Guntur: గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ సోమవారం పాల్గొన్నారు.
Guntur: అయ్యప్ప సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ లక్ష్మీ అపర్ణ!
గుంటూరు: గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి మాలధారులకు అన్నప్రసాదాలు వడ్డించి, సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో గుంటూరు నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.




