Guntur: నగర అభివృద్ధిపై మార్నింగ్ వాకర్స్‌తో అభిప్రాయాలు పంచుకున్న మేయర్ అభ్యర్థి!

Guntur: గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్‌, లాఫింగ్ క్లబ్ సభ్యులను కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ. ఘన విజయాశీస్సులు అందజేసిన సభ్యులు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Oct 2026 1:03 PM IST
Guntur
X

Guntur: నగర అభివృద్ధిపై మార్నింగ్ వాకర్స్‌తో అభిప్రాయాలు పంచుకున్న మేయర్ అభ్యర్థి!

Guntur: గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ బుధవారం ఎన్టీఆర్ స్టేడియాన్ని సందర్శించి, వాకర్స్‌, లాఫింగ్ క్లబ్ సభ్యులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చిరునవ్వులతో సాగిన పలకరింపులు, ఆత్మీయ సంభాషణలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా వాకర్స్‌, లాఫింగ్ క్లబ్ సభ్యులు లక్ష్మీ అపర్ణ కి హృదయపూర్వక విజయాశీస్సులు అందజేశారు. కూటమి ప్రభుత్వానికి, లక్ష్మీ అపర్ణ కి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని భరోసా వ్యక్తం చేశారు. ప్రజల ఆప్యాయత, ఆదరణ మధ్య సాగిన ఈ కార్యక్రమం పరస్పర విశ్వాసానికి, ఆత్మీయ అనుబంధానికి వేదికగా నిలిచింది.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN