Guntur: జాగ్రత్తలు పాటించాలని గుంటూరు ప్రజలకు కూటమి మేయర్ అభ్యర్థి విజ్ఞప్తి!
Guntur: అర్నబ్ తుఫాను ముప్పు నేపథ్యంలో గుంటూరు ప్రజలను అప్రమత్తం చేసిన కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి.
Guntur: జాగ్రత్తలు పాటించాలని గుంటూరు ప్రజలకు కూటమి మేయర్ అభ్యర్థి విజ్ఞప్తి!
Guntur: అర్నబ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో గుంటూరు నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగుల సమీపంలో ఉండవద్దని కోరారు. సిటీ చివర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ, ప్రభుత్వ అధికారుల సూచనలను పాటించాలని తెలిపారు. ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ తమ కుటుంబ సభ్యుల క్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.




