Guntur: గుంటూరులో మార్వాడీ సంఘం ప్రతినిధులతో మేయర్ అభ్యర్థి ఆత్మీయ సమావేశం!
Guntur: గుంటూరులో మార్వాడీ సంఘం ప్రతినిధులతో మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఆత్మీయ సమావేశం. కూటమి విజయం కోసం ప్రచారం, ప్రముఖుల హాజరు.
Guntur: గుంటూరులో మార్వాడీ సంఘం ప్రతినిధులతో మేయర్ అభ్యర్థి ఆత్మీయ సమావేశం!
Guntur: గుంటూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్వాడీ సంఘం ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ అభ్యర్థి శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ మార్వాడీలు ముందుంటున్నారు. మీ సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. నేను మీ ఇంటి ఆడబిడ్డను. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి” అని కోరారు.
పెమ్మసాని మాట్లాడుతూ ఏ ప్రాంతంలో అయినా ఉద్యోగాలు రావాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా స్మాల్, మీడియం ఇండస్ట్రీస్, వ్యాపారాలు ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.అలాగే సమాజ సంప్రదాయాలను పాటిస్తూ, ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని 10 మందికి పంచుతున్న మార్వాడీ, జైన్ సోదరుల సంప్రదాయాలు ఈ సమాజానికి మార్గదర్శకం.ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు.
ఈ సమావేశంలో జైన్ మార్వాడీ సమాజ అధ్యక్షుడు జుగ్రాజ్ భండారితో పాటు అమృత్లాల్, మహావీర్చంద్, కిశోరీలాల్, గౌతమ్‌చంద్, మహావీర్ లూనియా, మోహన్‌లాల్, అశోక్, సురేష్‌కుమార్, కాంతిలాల్ సలేచా, ఘేవర్చంద్, వినోద్ బాగ్రేచా, రాజు బఫ్నా, రాజు భండారి, లలిత్ భండారి, రమేష్ పోర్వాల్ తదితరులు పాల్గొన్నారు. రమేష్‌కుమార్ తోష్నివాల్, జగదీష్, జుగ్రాజ్ పురోహిత్, మాజీ మేయర్ కోవెలమూడి (రవీంద్ర) నాని , ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు , గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతి రావు , టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య , మాజీ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ (బాబు) , పాల్గొన్నారు.




