Dornala: దోర్నాల విద్యార్థుల కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సందర్శన
Dornala: దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మార్కాపురం దేవరాజుగట్టు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించి ఆధునిక సాంకేతికతపై అవగాహన పొందారు.
Dornala: దోర్నాల విద్యార్థుల కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సందర్శన
మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల వృత్తి విద్యా కోర్సులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మరియు IT Enabled Services (ITES) అంశాలపై అవగాహన పెంపొందించేందుకు దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులు మార్కాపురం జిల్లా, దేవరాజుగట్టు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు.
పారిశ్రామిక సందర్శనలో భాగంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పైథాన్ ప్రోగ్రామింగ్, డిజిటల్ లైబ్రరీతదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి పనితీరు మరియు ఉపయోగాల గురించి అవగాహన పొందారు.
పాఠ్యపుస్తకాల్లోని అంశాలను చదవడంతో పాటు, వాటిని ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ప్రాయోగిక అవగాహన మరియు నైపుణ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. శ్యామ్ ప్రసన్న తాంజలి, ఉపాధ్యాయులు ఎస్. అనసూయ దేవి, నాగమూర్తి, విజయ మాణిక్యం, రహమత్, పోలయ్య, వెంకట శివ, మీటే నాయక్, పి. రామా నాయక్, ఆవులయ్య, ఐటీ ఉపాధ్యాయులు సయ్యద్ నాయబ్ రసూల్, అగ్రికల్చర్ ఉపాధ్యాయులు టి. నరేష్, ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయులు ఎన్. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.




