Mangalagiri: రాజ్యాంగ విలువలను ప్రతి భారతీయుడు గౌరవించాలి: గళ్ళా మాధవి!

Mangalagiri: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ విలువలను ప్రతి భారతీయుడు గౌరవించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Nov 2026 5:30 PM IST
Mangalagiri
X

Mangalagiri: రాజ్యాంగ విలువలను ప్రతి భారతీయుడు గౌరవించాలి: గళ్ళా మాధవి!

మంగళగిరి: భారత రాజ్యాంగ విలువలను ప్రతి భారతీయుడు గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరుడిగా ముందుకు సాగాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, టీడీపీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ...

ప్రజల కోసం ప్రజలే రూపొందించుకున్న నియమావళి భారత రాజ్యాంగమని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు గర్వంగా జరుపుకోవాల్సిన పండుగలు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవంతో పాటు రాజ్యాంగ దినోత్సవమని పేర్కొన్నారు.

రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, దేశ ప్రజల హక్కులు, బాధ్యతలు, సమానత్వం, స్వేచ్ఛకు పునాది అని అన్నారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి రాజ్యాంగ మౌలిక విలువలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులని వివరించారు.

ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, మహనీయుల కృషి, రాజ్యాంగ రూపకర్తల మేధస్సుతో రూపొందిన ఈ పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతి భారతీయుడు గౌరవించాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరిస్తూ, వాటిని విస్మరించకుండా ముందుకు సాగాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఇతరుల హక్కులను కాపాడుతూ, జీవించాలని అన్నారు. ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించి, బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిగా దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN