Mangalagiri: మంగళగిరిలో 72 కేజీల గంజాయి పట్టివేత, నలుగురి అరెస్టు
Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ ఖాజా టోల్ ప్లాజా వద్ద 72 కేజీల గంజాయిని పోలీసులు, ఈగల్ టీం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు, రెండు కార్లు సీజ్.
Mangalagiri: మంగళగిరిలో 72 కేజీల గంజాయి పట్టివేత, నలుగురి అరెస్టు
మంగళగిరి: మంగళగిరి మండలం ఖాజా టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి 72 కేజీలు గంజాయిని పట్టుకున్న రూరల్ పోలీసులు మరియు ఈగల టీం. కేసు వివరాలు వెల్లడించిన మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి కె వెంకటేశ్వర్లు, సీఐ వెంకట్. ఒడిశాను నుండి బెంగళూరు వయా ఆంధ్రప్రదేశ్ మీదుగా వస్తున్న రెండు కార్లను తనిఖీ నిమిత్తం ఆపమనగా ఆపకుండా వెళ్లిపోవడం జరిగింది.
ఆ కారులను వెంబడించి చిన్న కాకాని హైలాండ్ వెనుక రైతులు సహాయంతో కట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. గంజాయి నిందితులను అరెస్టు చేసే సమయంలో పోలీసులపై తిరగబడిన నిందితులు.
నిందితులు కేజీ గంజాయి ఏడు వేల రూపాయలు కొనుగోలు చేసి బయట మార్కెట్లో 20 నుండి 25 వేల రూపాయల అమ్ముతున్నట్లు దర్యాప్తులో వెల్లడి.
నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు డిఎస్పి కె వెంకటేశ్వర్లు వెల్లడి. డీఎస్పీ తో పాటు సిఐ వెంకట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు




