Bapatla: జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు!
Bapatla: ఈ నెల 20న జరగనున్న బాపట్ల జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మంగళవారం ఆదేశించారు.
Bapatla: జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు!
బాపట్ల జిల్లా: ఈ నెల 20న నిర్వహించనున్న బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఈ నెల 20 న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ నెల 20న నిర్వహించనున్న బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, సమావేశ మందిరంలో వసతులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత జడ్పీ సి ఈ ఓ కు సూచించారు.
జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులతో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొననున్నారని తెలిపారు.




