Ponnur: పొన్నూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు!
Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరులో అంగన్వాడీ ఉత్సవాల సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజా అంగన్వాడీ సేవలపై అవగాహన కల్పించారు.
Ponnur: పొన్నూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు!
Ponnur: పొన్నూరు పట్టణంలోని అంగన్వాడీ సెంటర్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పొన్నూరు ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మజా తెలిపారు అంగన్వాడి ఉత్సవాల కార్యక్రమం సందర్భంగా పొన్నూరు పట్టణ ఐదో వార్డు అంగన్వాడి కేంద్రం నందు ఎరుకల వాడ, బావ నగర్ కాలనీ మరియు సాయి నగర్, కలిపి అంగన్వాడి ఉత్సవం నిర్వహించడం జరిగింది.
అంగన్వాడీ కేంద్రంలో అనుబంధ పోషక ఆహారం, పూర్వ విద్య, ప్రాథమిక తరగతులు. రిఫనరీ సేవలు, వ్యాధి నిర్ధారణ, టీకాలు, పోషక ఆహారం పై అవగాహన లాంటి సేవలను వినియోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు పిల్లల తల్లిదండ్రులు సన్మానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో M V సుకన్య షేక్ రేష్మ, G.విజయ కుమారి, బుల్లెమ్మాయి, పి సుజనా మరియు అంగన్వాడి సహాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.




