Macherla: మార్చి నాటికి భూ రీసర్వే పూర్తి చేస్తాం.. కలెక్టర్ కృతికా శుక్లా!

Macherla: మాచర్లలోని నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. అర్జీల స్వీకరణ.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 21 Sept 2026 4:56 PM IST
Macherla
X

Macherla: మార్చి నాటికి భూ రీసర్వే పూర్తి చేస్తాం.. కలెక్టర్ కృతికా శుక్లా!

Macherla: మాచర్ల నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కుటుంబ సమస్యలు,అన్నదమ్ముల మధ్య వివాదాలు,కోర్టులను ఆశ్రయించాల్సిన అంశాలను కూడా ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తీసుకువస్తున్నారని,అలాంటి కొన్ని సమస్యలు న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. చట్టపరంగా పరిష్కరించాల్సిన అంశాల విషయంలో సంబంధిత న్యాయ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

భూ సమస్యలకు సంబంధించి చేపడుతున్న ల్యాండ్ రీసర్వే ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని తెలిపారు. వచ్చే మార్చి నాటికి మొత్తం భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్తెలిపారు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై మరింత నమ్మకం ఏర్పడుతుందని కలెక్టర్, ఎమ్మెల్యే పేర్కొన్నారు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA