Guntur: ఏసీఎం టెక్ ఫెస్ట్ 'స్పర్ధా'లో కిట్స్ విద్యార్థుల అద్భుత విజయం!

Guntur: గుంటూరు వీవీఐటీలో జరిగిన జాతీయ స్థాయి ఏసీఎం టెక్ ఫెస్ట్ ‘స్పర్ధా’లో కిట్స్ (KITS) విద్యార్థులు 3 బంగారు, 2 రజత పతకాలతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 14 Oct 2026 3:07 PM IST
Guntur
X

Guntur: ఏసీఎం టెక్ ఫెస్ట్ 'స్పర్ధా'లో కిట్స్ విద్యార్థుల అద్భుత విజయం!

Guntur: స్థానిక కేకేఆర్ & కేఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (KITS) విద్యార్థులు జాతీయ స్థాయి ఏసీఎం (ACM) టెక్నికల్ ఫెస్ట్ అయిన ‘స్పర్ధా’లో అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. వీవీఐటీ (VVIT) కళాశాలలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి సాంకేతిక పోటీలలో కిట్స్ విద్యార్థులు మూడు బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించి కళాశాలకు ఘనకీర్తిని తీసుకొచ్చారు.

దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ టెక్నికల్ ఫెస్ట్‌లో కిట్స్ విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకత మరియు ప్రతిభను చాటుకున్నారు. వివిధ పోటీలలో అద్భుత ప్రదర్శనతో అత్యధిక విజయాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకోవడం విశేషం.

విద్యార్థులు సాధించిన ఈ విజయంపై కళాశాల చైర్మన్ డాక్టర్ కోయ సుబ్బారావు గారు విద్యార్థినీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కళాశాల సెక్రటరీ శ్రీ కోయ శేఖర్ గారు మాట్లాడుతూ ఈ విజయం విద్యార్థుల కృషి, పట్టుదల, సాంకేతిక నైపుణ్యాలకు నిదర్శనమని ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెరుగుతాయని తెలిపారు.

కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే హరి బాబు గారు ప్రిన్సిపాల్ డాక్టర్ పి బాబు గారు విభాగాధిపతి డాక్టర్ జి మురళి గారు ఏ సీఎం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు మరియు అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU