Guntur: కిట్స్‌లో 'యువత భవితకు భరోసా' సదస్సు.. ఎంపీ రామకృష్ణ

Guntur: గుంటూరు వింజనంపాడు కిట్స్ కళాశాలలో 'యువత భవితకు భరోసా' సదస్సు నిర్వహించారు. ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే రామాంజనేయులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 29 Sept 2026 7:25 PM IST
Guntur
X

Guntur: కిట్స్‌లో 'యువత భవితకు భరోసా' సదస్సు.. ఎంపీ రామకృష్ణ

గుంటూరు జిల్లా: స్థానిక గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం లో వింజనంపాడు:దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే శక్తి యువతకే ఉందని అని రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ అన్నారు. స్థానిక వింజనంపాడులోని కేకేఆర్ అండ్ కేఎస్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్ ) కళాశాలలో విద్యార్థుల కోసం యువత భవితకు భరోసా’ మోటివేషనల్ అవేర్‌నెస్ సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ భాష్యం రామకృష్ణ గారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నైపుణ్యాలను పెంపొందించుకుని నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమలు, భవిష్యత్తులో రానున్న పరిశ్రమల ద్వారా యువతకు లభించనున్న అవకాశాలను వివరించారు.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బుర్లా రామాంజనేయులు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నూతన పారిశ్రామిక విధానాల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభంతో భవిష్యత్తులో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ పెట్టుబడులను ఆకర్షిస్తూ 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు కళాశాల స్థాయి నుంచే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

కళాశాల ఛైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు గారు , కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. బాబు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు, అధ్యాపకులు, కూటమి నాయకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 2,000 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU