Vinjanampadu: కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ సత్తా: టీవీఎస్ లూకాస్‌‌లో 163 మందికి కొలువులు

Vinjanampadu: గుంటూరు సమీపంలోని వింజనంపాడు కిట్స్ (KITS) కళాశాల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 163 మంది విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థ టీవీఎస్ - లూకాస్‌‌కు ఎంపికయ్యారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 3 Oct 2026 7:16 PM IST
Vinjanampadu
X

Vinjanampadu: కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ సత్తా: టీవీఎస్ లూకాస్‌‌లో 163 మందికి కొలువులు

Vinjanampadu: స్థానిక వింజనంపాడు లోని కేకేఆర్ అండ్ కె ఎస్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) కళాశాల విద్యార్థులు ప్రాంగణ నియామకాలలో విశేష ప్రతిభ కనబరిచి ప్రముఖ బహుళజాతి సంస్థ టీవీఎస్ - లూకాస్ లిమిటెడ్, చెన్నై కంపెనీకి ఎంపికయ్యారు. ఈ నియామకాల్లో కళాశాలకు చెందిన 163 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు సంవత్సరానికి రూ. 3 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు.

కళాశాల ఛైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం వల్లే ప్రతిష్టాత్మక టీవీఎస్ సంస్థలో ఇన్ని ఉద్యోగాలు సాధించగలిగారని కొనియాడారు.భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడమే కిట్స్ ప్రాథమిక ధ్యేయమని, ఈ విజయం కళాశాల నాణ్యమైన విద్యకు నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రిన్సిపల్ డాక్టర్ పి. బాబు గారు & డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు గారు మాట్లాడుతూ తొలి ప్రయత్నంలోనే భారీ సంఖ్యలో విద్యార్థులు ఎంపిక కావడం హర్షణీయమని, విద్యార్థులు తమ వృత్తిపరమైన జీవితంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు. ప్లేస్‌మెంట్ హెడ్ శ్రీ సి.హెచ్. చంద్రశేఖర్ రెడ్డి గారు కళాశాలలో అందించిన ప్రత్యేక ప్లేస్‌మెంట్ శిక్షణ, కోడింగ్, ఆప్టిట్యూడ్ మరియు సాఫ్ట్ స్కిల్స్ తరగతులే విద్యార్థుల ఈ విజయానికి ప్రధాన కారణమని వివరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపక బృందం, ప్లేస్‌మెంట్ విభాగం ప్రతినిధులు మరియు ఎంపికైన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU